![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -130 లో.. అందరు తీసుకుటున్నారు.. నువ్వు కూడా చీర తీసుకోమని ప్రేమతో ధీరజ్ అంటాడు. నాకు మావయ్య అన్న మాటలు గుర్తున్నాయి.. నువ్వు కోనివ్వు అని ప్రేమ అంటుంది. నా దగ్గర వెయ్యి పదిహేను వందలకి మించి లేవని ధీరజ్ అనగానే వాటితోనే కోనివ్వమని ప్రేమ అడుగుతుంది. సరేనని ధీరజ్ అంటాడు.
మరొకవైపు సాగర్ కి షర్ట్ సెలక్ట్ చేస్తుంది నర్మద. ట్రయల్ రూమ్ కి వెళ్లి ఈ బటన్ పట్టట్లేదని నర్మదని పిలుస్తాడు. నర్మదకి సాగర్ ట్రయల్ రూమ్ లో ముద్దు పెట్టబోతుంటే అప్పుడే డ్రెస్ లు ట్రయల్ చెయ్యడానికి కామాక్షి, అమూల్య వచ్చి ట్రయల్ రూమ్ ఓపెన్ చేస్తారు. వాళ్ళని అలా చూసి ఏం చేస్తున్నావ్ రా.. ఈ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళతో ఇదే లొల్లి అంటూ అమూల్యని తీసుకొని కామాక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మరొకవైపు ప్రేమకి ధీరజ్ చీర సెలక్ట్ చేస్తాడు. ప్రేమ కట్టుకొని చూస్తుంది. ఒక్కసారిగా చీరతో ధీరజ్ లాగగానే ధీరజ్ దగ్గరికి వస్తుంది ప్రేమ. ఇద్దరు ఒకరికొకరు రొమాంటిక్ గా చూసుకుంటారు. మళ్ళీ వాళ్ళని కామాక్షి, అమూల్య చూసి అక్కడ వాళ్ళు.. ఇక్కడ వీళ్ళు అంటూ గుణుక్కంటు వెళ్తారు. ఆ తర్వాత రామారాజు తెల్లారితే పెద్దోడి పెళ్లి అని తన హ్యాపీ నెస్ ని వేదవతితో షేర్ చేసుకుంటాడు.
మరొకవైపు ఎన్ని ప్రయత్నలు చేసిన ఆ రామరాజు తన పెద్ద కొడుకు పెళ్లి చేస్తున్నాడు. ఇక రేపటి నుండి వాడి పొగరు ఎవరు ఆపలేరని సేనాపతి అంటాడు. నేను రేపు పెళ్లి జరగకుండా ఆపుతానని విశ్వ అంటాడు. తరువాయి భాగంలో ప్రేమ అందంగా రెడీ అయి వస్తుంటే ధీరజ్ ప్లాట్ అవుతాడు. మరొకవైపు శ్రీవల్లిని కిడ్నాప్ చెయ్యడానికి తనకి తెలిసిన మేకప్ ఆర్టిస్ట్ ని శ్రీవల్లి దగ్గరికి పంపిస్తాడు విశ్వ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |